ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన కాంపాక్ట్ ఎస్యూవీ 3 లో సీఎన్జీ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ కొత్త మోడల్ న ఆవిష్కృతం కానుంది. పరీక్షల సమయంలో రోడ్డుపై కనిపించిన వాహనం డిజైన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.
పెట్రోల్, డీజిల్, విద్యుత్ వెర్షన్లతో ఇప్పటికే అందుబాటులో ఉన్న 3 కు సీఎన్జీ ఎంపికను జోడించడం ద్వారా తక్కువ ఇంధన ఖర్చుతో ఎస్‌యూవీని వినియోగించాలనుకునే వారికి మరో అవకాశం కల్పించాలని కంపెనీ భావిస్తోంది.
డిజైన్ వివరాలు
పరీక్షల సమయంలో కనిపించిన వాహనంలో వెనుక అద్దంపై సీఎన్జీ స్టిక్కర్ ప్రత్యేకంగా కనిపించింది. మిగతా డిజైన్ విషయాల్లో ప్రస్తుతం ఉన్న 3 మోడల్ లక్షణాలనే కొనసాగించినట్లు తెలుస్తోంది. కనెక్టెడ్ టెయిల్ ల్యాంపులు, వెనుక స్పాయిలర్, రూఫ్ రైల్స్, వెండి రంగు స్కిడ్ ప్లేట్‌తో కూడిన నల్లటి బంపర్ ఇందులో కనిపిస్తున్నాయి.
ఇంజిన్ అంచనాలు
కొత్త సీఎన్జీ మోడల్లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు అనుసంధానించిన సీఎన్జీ వ్యవస్థను అందించవచ్చని ఆటోమొబైల్ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇంజిన్ పెట్రోల్ వెర్షన్లో సుమారు 111 శక్తి, 200 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అయితే సీఎన్జీ ఇంధనంతో పనిచేసేటప్పుడు ఎంత శక్తిని అందిస్తుంది, మైలేజీ ఎంత ఉంటుంది అనే వివరాలను మహీంద్రా ఇంకా వెల్లడించలేదు.






