జనగామ జిల్లాలో కొందరు బ్రోకర్లు అక్రమ దందాలు నడుపుతూ, తమ పనులు జరగనప్పుడు జిల్లా కలెక్టర్‌పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు KVNL రెడ్డి ఆరోపించారు. జనగామ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పారదర్శకంగా పనిచేస్తున్నారని KVNL రెడ్డి తెలిపారు. కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం అధికారులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ, వినతులు స్వీకరిస్తున్నారని KVNL రెడ్డి గుర్తుచేశారు. నిజాయితీగా పనిచేసే అధికారులను విమర్శించడం తగదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ కొంతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు బొమ్మకంటి అనిల్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తోకల హరీష్, బింగి రమేష్, డాక్టర్ వెంకటేశ్వర్లు, సందీప్, వల్లాల వెంకట్, చందు తదితరులు పాల్గొన్నారు.








