విజయదశమి, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఏడెల్లి కార్తీక్ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనమని అన్నారు.
విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజల జీవితాల్లో విజయాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ పండుగల విశిష్టతను భావితరాలకు అందించాలని సూచించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి దసరా, బతుకమ్మ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఏడెల్లి కార్తీక్ కోరారు.












