నర్మెట
నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ పెండ్యాల దేవేందర్ ను, నర్మెట ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చాగర్ల రఘుపతిని నర్మెట నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధికారులకు శాలువా కప్పి ఆహ్వానించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతకింది సురేష్, సర్పంచ్ ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్రెడ్డి, బీ ఆర్ ఎస్వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్ రెడ్డి, నర్మెట గ్రామ అధ్యక్షుడు నక్కల రవి, వార్డు సభ్యుడు పొన్నబోయిన బాలకృష్ణ, ముక్కెర రాజు, పోతిరెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.












