తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు జనగామ జిల్లా సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడిగా మండలం వెల్దండ సర్పంచ్ కంతి ఆంజనేయులును నియమించారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆదివారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ గౌరవ అధ్యక్షులు వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు, జనగామ జిల్లా సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడిగా మండలం వెల్దండ సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కంతి ఆంజనేయులును నియమించారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆదివారం కంతి ఆంజనేయులుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ () నిధులను ప్రతినెలా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్య పనిచేస్తున్న సర్పంచుల గౌరవ వేతనాన్ని పెంచాలని కోరారు. పెరుగుతున్న ఖర్చులు, సర్పంచులపై ఉన్న బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కంతి ఆంజనేయులు మాట్లాడుతూ, జనగామ జిల్లాలోని సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ తరఫున ముందుండి పనిచేస్తానని, గ్రామ పంచాయతీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ గౌరవ అధ్యక్షులు వి. శ్రీనివాస్ గౌడ్ మార్గదర్శకత్వంలో, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ నాయకత్వంలో సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేస్తామని దండెం సంపత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.









