ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని చాటుతూ బీఆర్ఎస్ జనగామ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి చేయూతనందించారు. మండలంలోని కిలాషాపురం గ్రామానికి చెందిన శివరాత్రి రవి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాకేష్‌రెడ్డి వెంటనే మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారి బాధలో భాగస్వాములయ్యారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రూ.6 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచి, మానవత్వాన్ని చాటుకున్న రాకేష్ రెడ్డిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జనగామ యాదగిరి, సర్పంచ్ సంగ కవితఅశోక్, కూసుబాయ్ తండా సర్పంచ్ రాజేందర్ నాయక్, సొసైటీ డైరెక్టర్ వీరస్వామి, నారగోని రవిచంద్ర, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి చేయూత
Share:

సారాంశం
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
ముఖ్య విషయాలు
- కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రూ.6 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
- ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని చాటుతూ బీఆర్ఎస్ జనగామ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి చేయూతనందించారు.
- విషయం తెలుసుకున్న రాకేష్‌రెడ్డి వెంటనే మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారి బాధలో భాగస్వాములయ్యారు.
- మండలంలోని కిలాషాపురం గ్రామానికి చెందిన శివరాత్రి రవి అనారోగ్యంతో మృతి చెందారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
296ఆర్టికల్స్
83,645వ్యూస్










