నర్మెట్ట, 6 July
తెలంగాణ ప్రభుత్వం రైతులకు వంద శాతం సబ్సిడీతో బయో 6938 బిజీ 2 బీటీ పత్తి విత్తనాలను అందిస్తోంది. ఈ విత్తనాలు మండలంలోని రైతు వేదికలలో అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి మమత తెలిపారు. ఇప్పటివరకు పత్తి విత్తనాలు నాటని రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తో రైతు వేదికల్లో తీసుకోవచ్చని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు వంద శాతం సబ్సిడీతో బయో 6938 బిజీ 2 బీటీ పత్తి విత్తనాలను అందిస్తుందని, ఈ విత్తనాలు రైతు వేదికలో అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి మమత తెలిపారు.
సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు బీటీ పత్తి విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏవో మమత మాట్లాడుతూ, నర్మెట్ట మండలంలో ఇప్పటివరకు పత్తి విత్తనాలు నాటని రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చి రైతు వేదికలలో తీసుకోవాలని కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ అనిత, రైతులు తదితరులు పాల్గొన్నారు.












