ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) జూలై 06
భతీయజనతప్టీన్మెట్టమండలఉపధ్యక్షులుజబోయనజహంీ్అధ్యక్షతన,మజీబజెపజల్లక్యద్శసోక్కంఅనల్కుమ్ముఖ్యఅతథహజైడ.శ్యమప్సద్ముఖ్జీ125వజయంతవేడుకలనుఘనంన్వహంచు.ఈసంద్భంప్టీనయకులు,క్యక్తలుఆయనచత్పటనకపూలమలలువేసనవళుల్పంచు.
భారతీయ జనతా పార్టీ నర్మెట్ట మండల ఉపాధ్యక్షులు రాజబోయిన జహంగీర్ అధ్యక్షతన డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ బిజెపి జిల్లా కార్యదర్శి, ఉప సర్పంచ్లా ఫోరం నర్మెట్ట మండల ప్రధాన కార్యదర్శి సోక్కం అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన దేశ సమైక్యత, జాతీయత, సుశాసనం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప దేశభక్తుడు, విద్యావేత్త, జాతీయవాది డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. "ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదనే సిద్ధాంతంతో దేశ సమగ్రత కోసం డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితాంతం పోరాడారని, ఆయన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని" పేర్కొన్నారు.
డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో దేశాభివృద్ధి, జాతీయ సమైక్యత కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నర్మెట్ట మండల ఉపాధ్యక్షులు, మెతుకు సిద్ధులు, కొర్ర నరేష్, కిసాన్ మోర్చా జిల్లా మాజీ కార్యదర్శి బైరగొని ఆంజనేయులు, మాన్ కీ బాత్ కన్వీనర్ గంగం గాల్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు బొల్లం అవినాష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పులి కపిల్, బూత్ అధ్యక్షులు పెళ్లి శివ, వెంకటేష్, సీనియర్ నాయకులు ఆనందాస్ నాగరాజ్, నాగభూషణ్ శర్మ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.












