రైజ్ అండ్ ఫాల్ సీజన్-2 విజేత షెహజాద్ పూనావాలా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన విజయానికి గుర్తుగా గెలుపు ట్రోఫీని ముఖ్యమంత్రికి చూపించి, ఆయనతో పంచుకున్నారు.
ఆరు వారాల పాటు సాగిన ఈ రియాలిటీ షోలో షెహజాద్ విజేతగా నిలిచి రూ.35 లక్షల ప్రైజ్‌మనీని గెలుచుకున్నారు. నటి ప్రియాంక చహర్ చౌదరి మొదటి రన్నరప్‌గా, గౌతమ్ గులాటీ రెండో రన్నరప్‌గా నిలిచారు.





