ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ () నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ ( ) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 34,236 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.
ఏఐఐఎంఎస్ అధికారులు ఫలితాలను ప్రకటించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్ష ద్వారా ఎండీ (), ఎంఎస్ (), ఎండీఎస్ (), ఆరేళ్ల డీఎం (), ఎంసీహెచ్ () వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఏఐఐఎంఎస్ సహా పలు జాతీయ ప్రాధాన్యత కలిగిన వైద్య విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి ఈ పరీక్ష కీలకం.
ఫలితాలను తనిఖీ చేసే విధానం
ఫలితాలను అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, హోమ్‌పేజీలో ఫలితాలు, ప్రకటనలు విభాగాన్ని ఎంచుకోవాలి. ఐఎన్ఐ సెట్ 2026 ఫలితాల లింక్‌పై క్లిక్ చేసి, ఫలితాల పీడీఎఫ్‌ను తెరవాలి. అందులో తమ రోల్ నంబర్‌ను నమోదు చేసి అర్హత స్థితిని తెలుసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం పీడీఎఫ్‌ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది.
మెరిట్ జాబితాలో ఉండే వివరాలు
మెరిట్ జాబితాలో అభ్యర్థి రోల్ నంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, పర్సంటైల్ స్కోర్, అభ్యర్థి కేటగిరీ, అర్హత స్థితి వంటి వివరాలు ఉంటాయి.
ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీలు, కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఏఐఐఎంఎస్ ప్రత్యేకంగా ప్రకటించనుంది. అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలు, వైద్య విభాగాలకు ప్రాధాన్యతలను నమోదు చేసుకోవాలి. ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరీ, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.











