స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం ఓప్పో సంస్థ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కలర్ ఓఎస్ 17ను ప్రకటించింది. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందించిన ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌లో మెరుగైన యానిమేషన్లు, కృత్రిమ మేధ ఆధారిత సదుపాయాలు, ఫోటో ఎడిటింగ్ సాధనాలు, భద్రతా ఫీచర్లను అందిస్తోంది. న భారత్‌లో విడుదల కానున్న ఓప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్ ఫోన్లలో ఇది తొలిసారిగా అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే ఉన్న ఇతర ఓప్పో ఫోన్లకు కూడా దశలవారీగా ఈ నవీకరణను అందించనున్నారు. కలర్ ఓఎస్ 17లో లివింగ్ ఫ్లో డిజైన్ పేరుతో కొత్త రూపకల్పనను తీసుకొచ్చారు. తెరపై కనిపించే అంశాల కదలికలు సహజంగా ఉండేలా, ఒక తెర నుంచి మరో తెరకు మారే సమయంలో వేగంగా స్పందించేలా మార్పులు చేశారు. బటన్లను నొక్కినప్పుడు స్పందన మరింత సహజంగా అనిపించేలా తీర్చిదిద్దారు. పారదర్శకతతో కూడిన దృశ్య ప్రభావాలు, మెరుగైన యానిమేషన్లు కూడా ఇందులో ఉన్నాయి.
కృత్రిమ మేధతో కొత్త సదుపాయాలు
ఈ కొత్త వ్యవస్థలో ఏఐ మైండ్ పైలట్ ద్వారా ఫైళ్లను గుర్తించడం, వాటిని క్రమబద్ధీకరించడం, పేర్లు మార్చడం వంటి పనులు చేయవచ్చు. అవసరమైన సమాచారాన్ని ఉపయోగించి ప్రయాణ ప్రణాళికల వంటి వివరాలను రూపొందించడంలోనూ ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఏఐ ఫోటో ఏజెంట్ సహాయంతో సాధారణ భాషలో సూచనలు ఇచ్చి ఫోటోలను సవరించవచ్చు. ఏఐ మైండ్ స్పేస్ ద్వారా వీడియోలు, పత్రాలు, ఇతర సమాచారాన్ని భద్రపరచి తర్వాత సులభంగా వెతుక్కోవచ్చు. ఏఐ మైండ్ సజెస్ట్ వినియోగదారులకు సందర్భానుసారమైన సూచనలు అందిస్తుంది.
ఓసీ అనే మరో ఫీచర్ కెమెరా ముందు కనిపించే వస్తువులు, దృశ్యాలను గుర్తించి వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించడంలో సహాయపడుతుంది. వస్తువుల గుర్తింపు, అనువాదం, పత్రాలను స్పష్టంగా స్కాన్ చేయడం వంటి పనులకు ఇది ఉపయోగపడుతుంది. వినియోగదారుల భద్రత కోసం ఏఐ కాల్ గార్డ్‌ను అందిస్తున్నారు. ఫోన్ కాల్స్ సమయంలో కృత్రిమంగా సృష్టించిన గొంతులు లేదా ఇతర అనుమానాస్పద సంకేతాల ద్వారా జరిగే మోసాలను గుర్తించి హెచ్చరించడమే దీని ఉద్దేశం.
మెరుగైన భద్రతా చర్యలు
అలాగే ప్రైవేట్ కంప్యూటింగ్ క్లౌడ్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా ముప్పులను దృష్టిలో ఉంచుకుని కొత్త రక్షణ చర్యలను ప్రవేశపెట్టారు. ఫైండ్ సిరీస్‌తో కలర్ ఓఎస్ 17 అందుబాటులోకి వచ్చిన తర్వాత, అర్హత కలిగిన ఇతర ఫోన్లకు కూడా దశలవారీగా విడుదల చేయనున్నారు. కొన్ని ఎంపిక చేసిన ఫైండ్ సిరీస్ ఫోన్లకు నుంచి, మరికొన్ని ఫైండ్, రెనో సిరీస్ ఫోన్లకు నుంచి అప్డేట్లు ప్రారంభం కానున్నాయి.
నవంబర్, డిసెంబర్ నెలల్లో మరిన్ని మోడళ్లకు, 2027 తొలి త్రైమాసికంలో కొన్ని పాత మోడళ్లకు అందించనున్నారు. అయితే అన్ని ఫోన్లకు ఒకేసారి నవీకరణ అందదు. ఫోన్ మోడల్, ప్రాంతం ఆధారంగా విడుదల తేదీలు మారవచ్చు. వినియోగదారులు తమ ఫోన్లోని సెట్టింగ్స్‌లో అబౌట్ డివైస్ విభాగానికి వెళ్లి సాఫ్ట్వేర్ అప్డేట్లను పరిశీలించవచ్చు.
మొత్తంగా, కలర్ ఓఎస్ 17తో ఫోన్ వినియోగ అనుభూతిని మెరుగుపరచడం, ఏఐ ఫీచర్లను విస్తరించడం, వ్యక్తిగత సమాచార భద్రతను బలోపేతం చేయడంపై ఓప్పో దృష్టి పెట్టింది.








