నర్మెట్ట, ఆగస్టు 1
నర్మెట మండలంలో వార్డు మెంబర్ల మండల ఇంచార్జిగా మచ్చుపహాడ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు గుండెటి రాంచందర్ శనివారం ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు సభ్యుల హక్కుల కోసం పోరాడుతామని, ప్రజలకు జవాబుదారీగా ఉంటామని తెలిపారు.
నర్మెట మండల వార్డు మెంబర్స్ మండల ఇంచార్జిగా మచ్చుపహాడ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు గుండేటి రాంచందరన్ను శనివారం ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో వార్డు మెంబర్స్ అందరూ కలిసి మండల ఇంచార్జిని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ.. వార్డు సభ్యుల హక్కుల కోసం పోరాటం చేస్తామని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు జవాబుదారీతనం వార్డు సభ్యులకు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నర్మెట ఉపసర్పంచ్ కొలెపాక స్వామి, వార్డు సభ్యులు పొన్నం బాలకృష్ణ, బొడికె వినోద్‌కుమార్, పాపనాయక్, గజ్జెల్లి వెంకటయ్య, బొల్లం అవినాష్, హరికృష్ణ, సురేష్, యంజి, ప్రశాంత్, బాపురాజు, కుమార్, రమేష్, జహాంగిర్, సుధాకర్, మల్లేషం తదితరులు పాల్గొన్నారు.










