తరిగొప్పుల, ఓరుగల్లు, 2026-11-20
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చింతల యాదయ్య
తరిగొప్పుల,నవంబర్ 20: తరిగొప్పుల మండల ముదిరాజ్ సంఘం మత్స్య సహకార సంఘం వైస్ చైర్మన్ గా ఎన్నికైన సుంకరి కనకరాజును, ఉమ్మడి వరంగల్ జిల్లా మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షుడు చింతల యాదయ్య ముదిరాజ్ మర్యాదపూర్వకంగా సత్కరించి అభినందించారు. వైస్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా కనకరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చింతల యాదయ్య మాట్లాడుతూ....మత్స్య సహకార సంఘం అభివృద్ధితోపాటు మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తూ,సంఘం సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.



