జనగామ, 13 September
కోధోణణధకషఉదో.దోఉధకోణకద.
అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు.. ఆధారాలు ఎక్కడ? - పల్లా రాజేశ్వర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పాలి: ఉల్లెంగుల సందీప్ అసెంబ్లీ వేదికగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ పార్టీ జనగామ పట్టణ యూత్ అధ్యక్షుడు ఉల్లెంగుల సందీప్ ఆరోపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే వాటిని బహిర్గతం చేయాలని సందీప్ డిమాండ్ చేశారు. ఆరోపణలకు ఆధారాలు లేని పక్షంలో జనగామ ప్రజలకు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.నిజం ఎప్పటికైనా గెలుస్తుందని, నిరాధారణ ఆరోపణలను జనగామ ప్రజలు తిప్పికొడతారని అన్నారు









