పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న ఊహాగానాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తోసిపుచ్చారు. ఏజెన్సీల వద్ద క్యూలు ఉంటాయనే పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న ఊహాగానాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తోసిపుచ్చారు. ఏజెన్సీల వద్ద క్యూలు ఉంటాయనే పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ప్రధాని మోదీ తీసుకున్న ముందుస్తు చర్యల వల్ల ఇబ్బందులను అధిగమించామని, గతంలో 34వేల టన్నులుగా ఉన్న దేశీయ గ్యాస్ ఉత్పత్తిని 56వేల టన్నులకు పెంచామని, అలాగే 1.07 లక్షల పెట్రోల్ పంపుల్లోనూ కొరత లేదని ఆయన పేర్కొన్నారు.











