నర్మెట్ట, 7 September
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు గడిచినా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని వారు ఆరోపించారు.
హామీలు అమలు చేయాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, లబ్ధిదారులు ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాలతో తాజా మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే దాదాపు 1000 రోజులు గడిచినా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి అర్హులైన ప్రజలు, రైతులు, లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలని కోరారు. మహిళలకు ప్రతి నెలా మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 అందించాలి, కల్యాణలక్ష్మి పథకంతో పాటు హామీ ఇచ్చిన తులం బంగారం అందించాలి, విద్యార్థినులకు హామీ ఇచ్చిన స్కూటీలను అందించాలి, రైతు కూలీలకు ప్రతి సంవత్సరం రూ.12,000 ఆర్థిక సాయం అందించాలి, రైతులకు సకాలంలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించి, జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులకు హామీ ఇచ్చిన మేరకు పెంచిన పింఛన్లు అందించాలి, ఆటో కార్మికులకు హామీ ఇచ్చిన రూ.12,000 ఆర్థిక సాయం అందించాలి, రైతు బీమా పథకాన్ని అమలు చేయాలి, వ్యవసాయానికి రోజుకు 16 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి రైతులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఎన్నికల హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కంతి ఆంజనేయులు, మాజీ ఫోరం అధ్యక్షులు రామిని శివరాజు, బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు నీరటి సుధాకర్, మాజీ సర్పంచులు, మండల నాయకులు ఆమెడపు కమలాకర్ రెడ్డి, కంతి రాజలింగం, పిట్టల రాజు, బావండ్లపల్లి రాజు, దారావత్ బిక్షపతి, ముప్పిడి విజయ ప్రతాప్, సర్పంచులు బానోత్ మహేందర్, చిన్నప్ప రెడ్డి, బానోత్ రమేష్, పండుగ జ్యోతి రమేష్, లింగాల హైమ రమేష్, భూక్య పద్మ రమేష్, అరుణ సంతోష్, BRSV మండల అధ్యక్షులు ఎల్లబోయిన నరేష్, గ్రామశాఖ అధ్యక్షులు గుగులోతు కిషన్, మేడబోయిన రాజు, ఉప సర్పంచులు కృష్ణ రెడ్డి, లత కర్ణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు పాతూరి తిరుపతి రెడ్డి, సిరిగిరి నర్సయ్య, గడ్డం పరశురాములు, గుండేటి రాజశేఖర్, భైరగోని రాజు, గద్దల విజయ్ కుమార్, గుండేటి రాంచందర్, ముక్కెర మహేందర్, గొల్లపల్లి చిన్న కుమారస్వామి, పన్నీరు అరవింద్, భైరగోని శ్రీనివాస్, తేజావత్ లాలు తదితరులు పాల్గొన్నారు.









