చిన్నకోడూరు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 26
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో భూ భారతి రీ సర్వేపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సభల ద్వారానే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తహసీల్దార్ సలీం తెలిపారు.
గ్రామాలలో భూ సమస్యలు గ్రామ సభల ద్వారానే పరిష్కారం అవుతాయని తహసీల్దార్ సలీం అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో సర్పంచు నాగమణి ఎల్లయ్య, భూభారతి రీ సర్వేపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రజలు భూ సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే గ్రామంలోని భూ సమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు.
భూభారతి రీ సర్వే ద్వారా గ్రామస్తులకు భూ సమస్యలు లేకుండా పోతాయని, కొద్ది రోజుల్లోనే మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ సర్వేకు గ్రామస్తులు, రైతులు సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదవ రెడ్డి, రైతులు, గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.



