సిద్దిపేట, 2026-11-25
అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ మరో నిండు ప్రాణాన్ని బలిగొంది.
అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. సిద్దిపేట పట్టణంలోని పొన్నాల శివారులో కింగ్ ప్యాలెస్ హోటల్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గణపురం గ్రామానికి చెందిన తానిషా (58) అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే, తానిషా తన సోదరి ఇంట్లో నిర్వహించనున్న భూమి పూజ కార్యక్రమానికి టీవీఎస్ స్పోర్ట్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కింగ్ ప్యాలెస్ సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో మహీంద్రా మరాజో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తానిషా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
కారు డ్రైవర్ దండు ప్రవీణ్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి భార్య కిష్టవ్వ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







