జనగాం, 2026-11-25
ఫ్లైఓవర్ పై అదుపు తప్పిన వాహనం.. తృటిలో తప్పిన ప్రమాదం
స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగుతుండగా కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుండి సొంత గ్రామం బంధనపల్లికి, వర్ధన్నపేటలో జరిగే సారీ ఫంక్షన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ దిగుతుండగా అడ్డుగా వచ్చిన ట్రాక్టర్ ను తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు తెలిసింది. వెంటనే అక్కడున్న స్థానికులు స్పందించి, బోల్తా పడిన కారును పైకి లేపి అందులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. పెద్ద ప్రమాదం తప్పడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.



