కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 14
సిద్దిపేట జిల్లా మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని నూతన గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోలు శ్రీనివాస్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పోలు శ్రీనివాస్ మాట్లాడుతూ, పిల్లలే దేశ భవిష్యత్తు అని, నేటి బాలలే రేపటి పౌరులు, నాయకులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే క్రమశిక్షణ, విద్య, సంస్కారం, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చల్ల తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు చిట్యాల సంపత్, గజ్జెల పద్మ-బాల్రెడ్డి, బండి సాత్విక, జాగిరి లక్ష్మీనారాయణ, బస్వరాజ్ జ్యోతి, గ్రామ కార్యదర్శి స్వరూప, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాల్ మహేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ ధర్మయ్య, అంగన్వాడీ టీచర్లు, వివోఏలు, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల అధ్యక్షులు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


