జనగామ, 12 November
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కుటుంబ వారసులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం () జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్, ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఆర్థిక సహాయం, ఉచిత వైద్యం అందించాలని వారు కోరారు.
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కుటుంబ వారసులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం () జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్, ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు డిమాండ్ చేశారు.
మండలం గానుగుపహాడ్లో జీగారి యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య కుటుంబం చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ప్రస్తుతం ఆయన వారసుడు బిక్షపతి అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా, భార్య అనసూయ కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయం జరిగే వరకు పోరాటం
కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్లో ఇంటి స్థలం, ఆర్థిక సహాయం, ఉచిత వైద్యం అందించాలని కోరారు. వారసులకు న్యాయం జరిగే వరకు ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సాదం రమేష్, ఉపాధ్యక్షుడు గుండా వెంకటయ్య, సహాయ కార్యదర్శులు శివకుమార్, జిట్టాబోయిన రమేష్, శీలా లింగన్న, గద్ద రాజు, బుమాండ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


