అనంతరం (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 12
మండల సమస్యలపై ఎస్సైతో బీఆర్ఎస్ యువ నాయకుడు చర్చ
తరిగొప్పుల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చెన్నకేశవులను బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు బైకాని బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై చెన్నకేశవులను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై ఎస్సైతో చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ సహకరించాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కుర్రె మల్లయ్య, మాజీ ఎంపీపీ జొన్నగోని సుదర్శన్ గౌడ్, సోలిపురం సర్పంచ్ దండెం శ్రీనివాస్, అక్కరాజుపల్లి సర్పంచ్ మంచినీళ్ల రాజు, మాజీ ఎంపీటీసీ భూక్యా జూంలాల్ నాయక్, మాజీ ఎంపీపీ నూకల కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ బెల్లం రాజు, వంగ భీమయ్య, చందులాల్ నాయక్, చిలువేరి సతీష్, జంపులు, దామెర పీటర్ తదితరులు పాల్గొన్నారు.


