ఎమ్మెల్యే పల్లా ఆదేశాలతో పోతారం గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన యువ నాయకుడు
మండలంలోని పోతారం గ్రామానికి చెందిన బబ్బురు అంజయ్య తల్లి మణెమ్మ ఇటీవల మృతి చెందడంతో, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల యువ నాయకుడు బైకాని బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మణెమ్మ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టసుఖాల్లో ప్రజలకు, కార్యకర్తలకు అండగా నిలవడమే తమ నాయకత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మణెమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుర్రె మల్లయ్య యాదవ్, సర్పంచులు భూక్య రవి నాయక్, భూక్య ధనుష్, ఉప సర్పంచ్ భూక్య మాన్సింగ్, మాజీ పార్టీ జనరల్ సెక్రెటరీ వంగ బీమయ్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు భైరగోని రాజు, మల్యాల నర్సయ్య, వంగ భీమయ్య, పాకాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.












