వివాహ వేడుకలో నూతన వధూవరులకు ఆశీస్సులు
కుటుంబ బంధాలకు పరస్పర నమ్మకం, అవగాహన, అన్యోన్యతే పునాది అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కేఎస్ఆర్ ఫంక్షన్హాల్లో తరిగొప్పుల మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు యాటెల్లి ఉప్పలయ్య కుమార్తె వివాహ వేడుకకు ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ, భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకుంటూ, కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని సూచించారు. ప్రేమానురాగాలు, నమ్మకంతోనే సంతోషకరమైన కుటుంబ జీవనం సాధ్యమవుతుందని అన్నారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గద్దల నర్సింగరావు,మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి చిలువేరు లింగం, సర్పంచులు భూక్యా రవి నాయక్, దండెం శ్రీనివాస్, చింతల జైపాల్, ప్రచార కార్యదర్శి రవి, జిల్లా నాయకులు ఏడేళ్లి శ్రీనివాస్ రెడ్డి, వంగ రామరాజు, మాజీ ఎంపీటీసీ తాళ్లపెల్లి రాజేశ్వర్ గౌడ్, యువజన అధ్యక్షుడు మల్యాల సుధీర్, గ్రామశాఖ అధ్యక్షుడు అంకం రాజారాం, ఆవుల రాజు, సాంటెక్క మొగిలి, థామస్, మైకేల్, సుంకరి రాజయ్య, వంగ బీమయ్యగౌడ్, సోషల్ మీడియా ఇన్చార్జి కొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












