మండలంలోని హన్మంతాపూర్ గ్రామ సర్పంచ్ పండుగ జ్యోతి రమేష్ జన్మదిన వేడుకలను సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కోసి ఎమ్మెల్యే సర్పంచ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగా రావు, తాజా మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ. గౌస్, మండల ప్రధాన కార్యదర్శి కంతి రాజలింగం, బావండ్లపల్లి రాజు, గ్రామ ఉపసర్పంచ్ మూల కిరణ్ గౌడ్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు ఎల్లబోయిన నరేష్, వార్డు సభ్యులు కొర్ర పాపన్న, పన్నీరు విజయశాంతి, అరవింద్, ఇరుగు మానస కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు ఇట్టబోయిన రమేష్, విశ్వనాధుల ఆంజనేయులు, చల్లా రాంనర్సయ్య, పోతని కుమార్, రాయారపు రాజు, ఇరుగు క్రాంతి, లొంక శివ, తేజావత్ రఘు, నాగంపల్లి శ్రీకాంత్, పొనగంటి కుమార్, భూక్య సాయి, గ్రామస్థులు దూసరి హరిగోపాల్, ఇట్టబోయిన రాజు, ఇరుగు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.










