మంగళవారం (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 10
మృతిరాలి కుటుంబాన్నికి ఉపసర్పంచుల ఫోరం అండ
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బొంతగట్టు నాగారం గ్రామ ఉపసర్పంచ్ సుంకరి కర్ణాకర్ తల్లి మరణించడంతో, మండల ఉపసర్పంచుల ఫోరం నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు పండుగ హరీష్, జిల్లా కార్యదర్శులు కృష్ణారెడ్డి, నాగపూరి కిషన్ గౌడ్, మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు చిలువేరు మహేందర్, ఉపాధ్యక్షులు ఎర్రం మహేష్, మూడవత్ రాజు, ప్రధాన కార్యదర్శి ఆకుల సురేష్, కార్యదర్శి భూక్యా రవి, కోశాధికారి నీల సంపత్, సలహాదారుడు బిరెడ్డి పాపిరెడ్డి, ఉపసర్పంచులు పెనుమల్ల రవి, భూక్యా మాన్సింగ్, నునావత్ సుమన్, బెజ్జం భవాని రవి, జరుపుల లకపత్, మూడవత్ కొమురుతో పాటు పలువురు ఉపసర్పంచులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి ఉపసర్పంచుల ఫోరం అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.


