అమ్మవారి ఆశీస్సులతోనే ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని అంకుషాపూర్ గ్రామ ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ అన్నారు. జనగామ జిల్లా మండలం అంకుషాపూర్ గ్రామంలో హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని, ఉత్సవాల నిర్వహణకు తన వంతు సహకారంగా రూ.2,016 విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా నాగపురి కిషన్ గౌడ్ మాట్లాడుతూ, అమ్మవారి కృపతో ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని, గ్రామ ప్రజలందరిపై దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండుగలు ఐకమత్యంతో నిర్వహించుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ యువసేన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.