నర్మెట మండలంలోని ఆగాపేట గ్రామంలో మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ వారి ఆధ్వర్యంలో, స్థానిక సర్పంచ్ డా. పగిడిపాటి రాజు సహకారంతో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 300 మందికి పైగా ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం: సీఐ అబ్బయ్య
నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. అబ్బయ్య ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని, ఆరోగ్యంగా ఉంటేనే అన్ని ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ డా. పగిడిపాటి రాజు ఆరోగ్యవంతమైన గ్రామమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు.
టీబీ నివారణపై అవగాహన
శిబిరంలో ప్రజలకు బీపీ, షుగర్, టీబీ లక్షణాలపై పరీక్షలు నిర్వహించారు. టీబీ వ్యాధి నివారణ మార్గాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు వివరించారు. ఈ ఉచిత వైద్య సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి.





