చిగురుమామిడి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 01
కరీంనగర్ జిల్లా మండలం రేకొండ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో అనుమతులు లేకుండా వేపచెట్టును తొలగించిన ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లా మండలం రేకొండ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో అనుమతులు లేకుండా తొలగించిన వేపచెట్టు ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఫిర్యాదు మేరకు ఎఫ్ఎస్ఓ అన్వర్ హుస్సేన్ శనివారం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, కార్యదర్శి అజయ్ కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాల్టా చట్టం ప్రకారం, చెట్టు కొలతలను బట్టి రూ.1,899 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం జరిమానా మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.


