నర్మెట్ట, 2026-08-03
నర్మెట మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రెగ్యూలర్ హెచ్ఎం, పీడీలు డిప్యూటేషన్ పై హన్మకొండలోని గిరిజనశాఖ కోచింగ్ సెంటర్లో కొనసాగుతున్న వారి ఆక్రమ డిప్యూటేషన్ ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు లకావత్ చిరంజీవి సోమవారం జిల్లా కేంద్రంలోని గ్రీవెన్స్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

పాఠశాల పరిస్థితి
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, వర్మెట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రెగ్యూలర్ హెచ్ఎంగా నియమితులైనప్పటికీ, హన్మకొండలోని గిరిజన శాఖ కోచింగ్ సెంటర్లో గత నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతో పాఠశాల ఇంచార్జి హెచ్ఎంతో కొనసాగుతోందని, పీడీ లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరంగా ఉంటున్నారని అన్నారు.
పైరవీలతో కొనసాగుతున్న డిప్యూటేషన్
వారి డిప్యూటేషన్ రద్దు చేసినప్పటికీ, పైరవీలతో హన్మకొండలోనే పనిచేస్తున్నారని చిరంజీవి ఆరోపించారు. ఇప్పటికే పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో అన్ని తరగతులకు సబ్జెక్టులు బోధించలేకపోతున్నారని తెలిపారు.
పోరాట హెచ్చరిక
ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులను సరిపడా నియమించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి యాకన్నరాథోడ్ ఉన్నారు.