గణేష్ నవరాత్రోత్సవాల వెల్దండ గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో విద్యా శక్తి - 3 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 110 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులతో పాటు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతి అందిస్తామని యూత్ అధ్యక్షుడు నీల వెంకటేష్ తెలిపారు. పోటీలను పగిడిపల్లి దామోదర్, బైరాగోని హరిప్రసాద్ ల సమక్షంలో నిర్వహించారు. విద్యార్థులకు భక్తితో పాటు భవిష్యత్తులో పోటీ పరీక్షలు ఎదుర్కొనే సామర్థ్యం ఏర్పడుతుందని ఈ నీల వెంకటేష్ అన్నారు. కార్యక్రమంలో అతిథులుగా కొంపెల్లి భాస్కర్ పాల్గొన్నారు. గణేష్ యూత్ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా చేర్యాల సంపత్ (పెద్ద), ఉపాధ్యక్షులుగా చేర్యాల మధు, రాజేష్, కోశాధికారులుగా మొకల సురేష్, కళ్యాణం బాస్కర్, గొడుగు రాజు, ప్రధాన కార్యదర్శిగా నీల హరీష్, కార్యవర్గ సభ్యులుగా కళ్యాణం సత్యనారాయణ, చేర్యాల గణేష్, కళ్యాణం బాల పోషాయ్య, కళ్యాణం మల్లికార్జున స్వామి, కళ్యాణం మహేష్, పుట్ట ఉపేందర్, మార్క మహేష్ (చేర్యాల సంపత్ చిన్న), చేర్యాల ప్రవీణ్, చేర్యాల ఆంజనేయులు, కళ్యాణం కరుణాకర్, చేర్యాల చంద్రమౌళి, దామెర శ్రీనివాస్, నీల నరేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తితో పాటు విద్యా నైపుణ్యాలను పెంపొందించే ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు.










