తరిగొప్పుల, జూలై 03
తరిగొప్పుల మండలంలోని సోలిపురం గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ దండెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామ ప్రజలంతా ఏకమై దేవుళ్లను ప్రార్థించడం విశేషం.
మండలంలోని సోలిపురం గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ దండెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు, చిన్నారులు, రైతులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ దేవత ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, జలాభిషేకాలు నిర్వహించారు.
గ్రామంపై ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు, వాగులు నీటితో కళకళలాడాలని, భూగర్భ జలాలు పెరిగి సాగునీటి సమస్యలు తొలగిపోవాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఇటీవల నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజలంతా ఏకమై దేవుళ్లను ప్రార్థించడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామానికి మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లించారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొని ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కూడా ప్రార్థించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దండెం శ్రీనివాస్ మాట్లాడుతూ... రైతే దేశానికి వెన్నెముక అని, రైతు సంతోషంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఖరీఫ్ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు పనులు పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు పెరిగి తాగునీరు, సాగునీటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రకృతి అనుగ్రహంతో ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, రైతులు, యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.












