మార్కెట్ డైరెక్టర్ కు శాలువాతో సన్మానం
నర్మెట మండలంలోని అమ్మాపురం గ్రామంలోని దుర్గామాత ఆలయంలో స్థానిక సర్పంచ్ బొలగాని రేఖ బాపురాజు, చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన కన్నబోయిన రామకృష్ణ బుధవారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా మార్కెట్ డైరెక్టర్ గా ఎన్నికైన రామకృష్ణను సర్పంచ్ రేఖ బాపురాజు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బొలగాని రాజు, నాయకులు బైరగోని సురేందర్, పండ్ల బాల నర్సు, గంగం ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.












