నంగునూరు మండల కేంద్రంలో శ్రీ వైష్ణవి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ యూత్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ, వినాయక ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని చాటుతాయని అన్నారు. గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.
అనంతరం గణనాథుని విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. యువత ఉత్సాహంగా పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్రం ఆంజనేయులు, సాయికుమార్, నాగరాజు, గోనపల్లి శివప్రసాద్, నరసింహులు, శేఖర్, భాను రాజు, సోప్పరి రాజ్ కిరణ్, భీమ్ రెడ్డి, అనీష్ రెడ్డి, రాకేష్, అఖిల్, వెంకటేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.











