జనగామ, 24 September
జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నదానం మహాదానమని, 22వ వార్డు ప్రజల ఐక్యత, భక్తిశ్రద్ధలు అభినందనీయమన్నారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









