మండలంలోని అమ్మపురం గ్రామంలోని అధ్యక్షుడు మూల కిరణ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచుల ఫోరం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు బుధవారం అమ్మాపురం గ్రామానికి జిల్లా అధ్యక్షుడు పండుగ హరీష్ ముదిరాజ్ విఘ్నేశ్వరుని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగపురి కిషన్ గౌడ్, మండల అధ్యక్షుడు మూల కిరణ్‌గౌడ్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సత్య లక్ష్మి సత్యనారాయణ, బండి మల్లారెడ్డి, చిన్న ప్రభాకర్ రెడ్డి, గంగం మల్లారెడ్డి, వినయ్ కుమార్, దేవనాద్ రెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫోరం నాయకులు మాట్లాడుతూ, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఐక్యంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ఫోరంను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అన్ని గ్రామాలు సుఖసంతోషాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.











