భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతిని నర్మెట్ట మండలంలోని వెల్దండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వెల్దండ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కంతి ఆంజనేయులు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను కొనియాడారు.
ఈ జయంతి వేడుకల్లో ఉప సర్పంచ్ బుస్సి లతా కరుణాకర్ రెడ్డి, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కొన్నే సంపత్, బిజెపి నాయకుడు శాతెల్లి రాజు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు పెద్దమాతరి నరసింహులు, ఎమ్మార్పీఎస్ నాయకుడు కంతి చరణ్ కుమార్ పాల్గొన్నారు.
ఇంకా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రావుకు ఘనంగా నివాళులర్పించారు.








