నర్మెట్ట మండలం ఇప్పలగడ్డ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ ధరావత్ రాజమణి రాజు నాయక్ ఆధ్వర్యంలో మహిళా భవనం, అంగన్వాడీ భవనం నిర్మాణ పనులను సాంప్రదాయ పద్ధతిలో ముగ్గు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ మహిళలకు సమావేశాలు, స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలు నిర్వహించేందుకు మహిళా భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. చిన్నారులకు మెరుగైన సంరక్షణ, విద్యా వాతావరణం కల్పించేందుకు ఆధునిక సౌకర్యాలతో అంగన్వాడీ భవనం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పించేందుకు గ్రామపంచాయతీ కృషి చేస్తుందని సర్పంచ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇట్టబోయిన సురేష్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యులు ఇట్టబోయిన శ్రీనివాస్, బానోత్ కుమార్, భానోత్ మంజుల బలరాం, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇట్టబోయిన ప్రతాప్, ఉపాధ్యక్షులు ఇట్టబోయిన కనకరాజు, అంగన్వాడి సూపర్వైజర్ శృతి, సాగర్, సీసీ శ్రీనివాస్, అంగన్వాడి టీచర్ శైలజ, వివో అధ్యక్షురాలు రజిత, స్థలదాత భానోత్ కాల్ రామ్, బాలు, గ్రామ పెద్దలు బండి వెంకన్న, బండి ఉప్పలయ్య, బండి సిద్ధులు, బండి కనకరాజు, మడి కంటి ప్రశాంత్, బండి మధు, బండి సరిత, బండి రాజు, గ్రామ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












