వైస్ చైర్మన్ సుంకరి కనకరాజు, కార్యదర్శిగా కలకుంట్ల సమ్మరాజు ఎన్నిక
తరిగొప్పుల, అక్టోబర్ 23.ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. సంఘం చైర్మన్గా పండుగ కనకయ్య, వైస్ చైర్మన్గా సుంకరి కనకరాజు, కార్యదర్శిగా కలకుంట్ల సమ్మరాజు ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా పండుగ శ్రీకాంత్, సుంకరి వెంకటేష్, చిలువేరు రాజశేఖర్, సుంకరి బాలరాజు, కలకుంట్ల రాజేందర్, మాదరబోయిన కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ పండుగ కనకయ్య మాట్లాడుతూ... తనపై నమ్మకంతో చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముదిరాజ్ సంఘం పెద్దలకు,సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.మత్స్యకారుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సభ్యులందరినీ కలుపుకొని సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి చిలువేరు లింగం, తరిగొప్పుల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు సుంకరి నరసింహులు, తరిగొప్పుల ఉపసర్పంచ్ చిలువేరు మహేందర్, కలకుంట్ల రాజు, మాజీ చైర్మన్ చిలువేరు ఉప్పలయ్య, చిలువేరు సంపత్, దండబోయిన రాములు, చిలువేరు సతీష్, సుంకరి రవి, సుంకరి ఉప్పలయ్య, కలకుంట్ల రాకేష్, దండబోయిన శేఖర్, కలకుంట్ల బాపురాజుతో పాటు ముదిరాజ్ సంఘం పెద్దలు, యువకులు పాల్గొన్నారు.












