బైరాన్ పల్లి ప్రజలకు అలగోని రాములు సేవ
బైరాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఒకటవ వార్డు ఎస్సీ కాలనీలో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ బర్మా రాజ మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
అలగోని లింగయ్య జ్ఞాపకార్థం ఆయన పెద్ద కుమారుడు అలగోని రాములు సొంత ఖర్చులతో మినీ వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు దాతగా ముందుకు వచ్చారు. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తన తండ్రి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని సర్పంచ్ రాజ మల్లయ్య పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధిలో భాగస్వామిగా ముందుకు వచ్చిన అలగోని రాములుకు సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నారైలు, విశ్రాంత ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తెలిజురి సిద్ధులు, పంచాయతీ కార్యదర్శి కట్కూరి రాజు, పేర్క రమేష్, పెర్కా భూమయ్య, కనకస్వామి, ఉపేందర్, రాజ నరేందర్, కనకయ్య, రాజు, దుర్గయ్య, ప్రశాంత్‌తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.












