మండలంలోని గట్లమల్యాల గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బత్తుల కనకయ్య కొంతకాలంగా అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ పాలకవర్గం మానవతా దృక్పథంతో స్పందించింది. కనకయ్య కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి అండగా నిలిచింది.
సర్పంచ్, ఉపసర్పంచ్ భరోసా
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇంగే నరేష్, ఉపసర్పంచ్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బత్తుల కనకయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రంగు లక్ష్మి, మంగళరపు స్వరూప, నోముల రవీందర్, లోకటి సత్తయ్య, కర్రె సంపత్, ఎర్ర బాబు, మంగళరపు రమ, కాంటూరి కోమల, పంచాయతీ కార్యదర్శి మాలోత్ లలిత, మాజీ ఉపసర్పంచ్ మంగళరపు తిరుపతి, దామోదర్, రంగు చింటూ, సంపతి, శంకరయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.











