జనగామ, గురువారం
జనగామ జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకులో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంకులోంచి దట్టమైన పొగలు, మంటలు వెలువడటంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
జనగామ జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకులో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకు నుంచి పొగలు, మంటలు రావడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సిఐ సత్యనారాయణ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకొని, ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.









