నర్మెట్ట, జూలై 01
నర్మెట్ట మండల మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్ తండ్రి తేజ తేజావత్ హేమ్లా నాయక్ (55) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన మండలంలో విషాదం నింపింది. హనుమంతపూర్ పరిధి దొడ్లగడ్డ తండాకు చెందిన హేమ్లా నాయక్, జనగామ నుండి నర్మెటకు వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు.
నర్మెట్ట మండల మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్ తండ్రి, తేజ తేజావత్ హేమ్లా నాయక్ (55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మండల వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
మండలంలోని హనుమంతపూర్ పరిధి దొడ్లగడ్డ తండాకు చెందిన మోహన్ నాయక్ తన బైక్‌పై వెళుతుండగా, జనగామ నుండి కారులో నర్మెటకు వస్తున్న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్ధునూరు గ్రామానికి చెందిన రాపాక రాజు దొడ్లగడ్డ తండా సమీపంలో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హేమ్లా నాయక్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు అతడిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై నాగేశ్ తెలిపారు.







