తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
హైకోర్టులో TUWJF పిటిషన్
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TUWJF) దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరపున స్పెషల్ అడ్వకేట్ జనరల్ వివరణ
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన జీఓ నంబర్ 252, జీఓ 103 సవరణలు తమ వృత్తి కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఫెడరేషన్ పిటిషన్లో పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అడ్వొకేట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు. ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని ఆయన కోరారు.
తదుపరి విచారణ నాలుగు వారాల తర్వాత
దీనికి ప్రతిస్పందనగా, స్పెషల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున హాజరై, జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా అక్రిడిటేషన్ కార్డుల గడువును పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డులు 2026 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.






