తరిగొప్పుల, జూలై 24
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపుర్ గ్రామంలోని బంజరుపల్లి వార్డులో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మోసీన్, ఎస్సై శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామసభలు ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికలని తహసీల్దార్ మోసీన్ పేర్కొన్నారు.
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపుర్ గ్రామంలోని బంజరుపల్లి వార్డులో శుక్రవారం స్థానిక సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మోసీన్, ఎస్సై శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తహసీల్దార్ మోసీన్ మాట్లాడుతూ... గ్రామసభలు ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికలని పేర్కొన్నారు. గ్రామస్థులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని, రెవెన్యూ సంబంధిత సమస్యలను నిబంధనల మేరకు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా అందేలా అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎస్సై శ్రీదేవి మాట్లాడుతూ.... గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
అనంతరం సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.... వార్డు అభివృద్ధికి గ్రామపంచాయతీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. గ్రామసభలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ మాట్లాడుతూ.... గ్రామ ప్రజల సమస్యల పరిష్కారమే గ్రామపంచాయతీ లక్ష్యమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమిష్టి సహకారంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
గ్రామసభలో వార్డు సభ్యులు ఏలేందర్, శివరాత్రి మల్లేష్, నాగపురి మాధురి–సతీష్, అబ్బి బిక్షపతి, జంజాల సంతోష్, తోటి పద్మ–మల్లయ్య, నాగపురి రాజేష్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








