మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న ఐబీఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు సౌరవ్ కొఠారి అద్భుత ప్రదర్శన చేశాడు. హాంకాంగ్‌కు చెందిన చౌ హాన్ మాన్‌పై 4-0తో ఘన విజయం సాధించాడు.
సౌరవ్ కొఠారి గ్రూప్-జేలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో నాకౌట్ దశకు టాప్ సీడ్‌గా అర్హత సాధించాడు. టోర్నీలో నాకౌట్ దశకు చేరుకున్న 24 మంది ఆటగాళ్లలో, తొలి ఎనిమిది మంది నేరుగా ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు భారత ఆటగాళ్లు ధ్వజ్ హరియా, పంకజ్ అద్వానీ కూడా నాకౌట్ దశకు చేరుకున్నారు. మొత్తం 21 మంది భారత పురుష ఆటగాళ్లలో 14 మంది తదుపరి దశకు అర్హత సాధించడం విశేషం.


