సోనియా గాంధీ ఆత్మకథలోని విషయాలను ఆమె మాజీ ఓఎస్డీ సమర్థించారు.
సోనియా గాంధీ ఆత్మకథలోని విషయాలను ఆమె మాజీ ఓఎస్డీ సమర్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను సోనియా గాంధీ కీలుబొమ్మగా నడిపించారనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించగా, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూసుకున్నారని ఆమె ఆత్మకథలో వివరించిన విషయాలను ఆయన సమర్థించారు. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.

