చిన్నకోడూరు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
చిన్నకోడూరు మండలంలోని మైలారం గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైలారం గ్రామంలో పెద్దమ్మ తల్లి మహోత్సవం సందర్భంగా బోనాలు పండుగను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.
చిన్నకోడూరు మండలంలోని మైలారం గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైలారం గ్రామంలో పెద్దమ్మ తల్లి మహోత్సవం సందర్భంగా బోనాలు పండుగను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఈ ఏడాది పెద్దమ్మ తల్లి దయతో పాడిపంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు శక్తిని ప్రసాదించాలని ఆయన అమ్మవారిని కోరారు. గతంలో ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకువచ్చిన కొన్ని పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రైతాంగానికి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసి రంగనాయక సాగర్ను నింపినట్లయితే ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉండేవి కావని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏలేటి రాధాకృష్ణశర్మ, కాముని శ్రీనివాసు, జంగిటి శ్రీనివాసు, కాముని ఉమేష్ చంద్ర, కీసరి పాపయ్య, కాల్వ ఎల్లయ్య, సర్పంచులు సరిత హరీష్, రేగుల శ్యామల దేవయ్య, నాగార్జున రెడ్డి, హనుమయ్య, యాట యాదయ్య, పోచబోయిన శ్రీహరి, నిమ్మల రవి, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


