బచ్చన్నపేట్, 2026-11-23
కార్తీక పౌర్ణమి సందర్భంగా కొడవటూరులోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు గుట్టపై అఖండ జ్యోతిని ప్రజ్వలన చేయనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి చిందం వంశీ తెలిపారు.
ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అఖండ జ్యోతిని దర్శించుకోవాలని ఆయన కోరారు.


