సరైన ఇన్వాయిస్ కలిగి ఉండి, వస్తువులు లేదా సేవలను స్వీకరించి, జీఎస్టీతో సహా పూర్తి మొత్తాన్ని సరఫరాదారుకు చెల్లించిన కొనుగోలుదారుడికి, విక్రేత పన్ను చెల్లించలేదనే కారణంతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నిరాకరించకూడదని సూచించింది.
సరైన ఇన్వాయిస్ కలిగి ఉండి, వస్తువులు లేదా సేవలను స్వీకరించి, జీఎస్టీతో సహా పూర్తి మొత్తాన్ని సరఫరాదారుకు చెల్లించిన కొనుగోలుదారుడికి, విక్రేత పన్ను చెల్లించలేదనే కారణంతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నిరాకరించకూడదని సూచించింది. అలాంటి సందర్భాల్లో కొనుగోలుదారుడిపై చర్యలు తీసుకునే బదులు, పన్ను ఎగవేసిన సరఫరాదారు నుంచే బకాయిలను వసూలు చేయాలని పేర్కొంది.
అలాగే, జీఎస్టీ నిబంధనల్లోని కొన్ని పరిమితులను సమీక్షించాలని, వ్యాపార సంస్థలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పరిధిని విస్తరించాలని కోరింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల నిర్మాణం, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, హోటళ్లు, విమానాశ్రయాల అభివృద్ధి వంటి వ్యాపార అవసరాలకు సంబంధించిన పెట్టుబడి వ్యయాలపై పన్ను క్రెడిట్ కల్పించాలని సూచించింది.
ఇన్వాయిస్, ఈ-వే బిల్లు, జీఎస్టీ రిటర్నుల ప్రక్రియలను అనుసంధానం చేయడం ద్వారా వ్యాపార సంస్థలపై అనవసరమైన పన్ను సంబంధిత భారాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడింది. ఈ మార్పులు అమలైతే, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నగదు నిల్వల సమస్యలు, పన్ను వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది.


